జనం న్యూస్ జూలై 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 -2026 విద్య సంవత్సరపు తల్లిదండ్రుల - ఉపాధ్యాయముల సమావేశం (పేరెంట్స్ టీచర్ మీటింగ్ ) సమావేశమును కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ డీ వి ఎన్ ఎస్ వర్మ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు .ఈ సందర్భగా ఆయన ప్రసంగిస్తూ, ఈ సమావేశము తల్లిదండ్రులు మరియు గురువుల మధ్య బందమును బలపరుస్తుందని, తద్వారా విద్యార్థి అబ్యాసం, ప్రవర్తన, ప్రగతి వంటి విషయాలు చర్చించుటకు కు వీలుగా ఈ సమావేశము ఏర్పాటు చేశామని,విద్యార్థి భవిష్యత్ అభివృద్ధి కొరకు కళాశాలలో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి పరిశోధన ప్రయోగశాలలు మరియు నాణ్యతమైన విద్యనందించుటయే ద్యేయం గ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, విద్యార్థి భవిష్యత్ ప్రయోజనం కొరకు ఈ సమావేశం ఏర్పాటుచేశామని తల్లిదండ్రులు తమ పిల్లల విద్య ప్రయాణములో పాల్గొనటం దీని ప్రధాన ఉదేశ్యం అని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల పాలక వర్గ సభ్యులు శ్రీ సందీప్ లు,కళాశాల డైరెక్టర్ శ్రీ ఎస్ వాసుదేవరావు గారు కళాశాల ప్రిన్సిపాల్ డా . కే సురేష్ బాబు , కళాశాల విద్యాశాఖధిపతులు డా. బి. రత్న రాజు , డా. టి. రవికుమార్, డా వై. వెంకట్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే. వి.వి బాపి రాజు ,కళాశాల వివిధ విభాగాధి పతులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లల విద్య పురోగాభివృద్ధిపై అధ్యాపకులతో చర్చించి సందేహములను నివృత్తి చేసుకున్నారు