జనం న్యూస్ జులై(12) సూర్యాపేట జిల్లా
తుమ్మూరుగం తిరుమలగిరి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరం నర కాలంలో ఏం చేశాడని ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని అన్నాడు. తుంగవుతి నియోజకవర్గానికి ముందుగా కాలేశ్వరం జలాలు ఇచ్చినంక అడుగుపెట్టాలని డిమాండ్ చేసినాడు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సూర్యపేట జిల్లాలో లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు అందించమని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక 13000 ఎకరాలకు కూడా నీరు అందించలేకపోతున్నారని అన్నారు. 1200 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. దళిత బంధు నిధులు ఆపి ఎమ్మెల్యే సామెల్ దళిత ద్రోహిగా మిగలరని ఎమ్మెల్యే, ఎంపీ,మంత్రి సొంత ఊర్లోనే రుణమాఫీ కాలేదని,రైతుబంధు రాలేదని,కళ్యాణ లక్ష్మి రాలేదని అన్నారు. అందరికీ పూర్తిగా అయినట్టు నిరుపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే మీ యొక్క పదువులకు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రైతులకు సంక్షేమ పథకాలు అందకుంటే సభ సాక్షిగా రైతంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యక్తిగత లాభాలు తప్ప మరో సోయి లేదు అని విమర్శించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.