ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిఎజిఎస్,ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదు విభాగం నందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి
జనం న్యూస్ 14జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేసి కూర్చున్నాయి, విద్యార్థులకు యూనిఫార్మ్స్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ట్రంక్ బాక్సులు, బెంచీలు బెడ్లు దుప్పట్లు చెద్దర్లు, రాక ఇబ్బందులు పడుతున్నారు, వీడితోపాటు త్రాగునీటి సమస్య మరుగుదొడ్లు మూత్రశాలలు సరిపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ టి.ఎ.జి.ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదు విభాగం నందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వసతి గృహాలు గురుకుల పాఠశాలలో సర్వేలు నిర్వహించిన సందర్భంలో సమస్యలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా తీర్యాణి మండలం ఎస్టి గురుకుల పాఠశాలలో సమస్యల తోటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది, త్రాగునీరు మరియు కాలకృత్యాలకు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు, అదేవిధంగా మైదానంలో పరిశుభ్రత లేదు పెద్దపెద్ద మొక్కలు తిరిగి బండరాళ్లతో మైదానం ఉంది దానితో ఆడుకోవడానికి పాఠశాల లేదు, అదేవిధంగా గిన్నెదరి ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్ నందు రేకులు లేక వర్షపు నీరు వచ్చి విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలని వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి స్పందించిన కలెక్టర్ త్వరలో గురుకుల పాఠశాలను విసిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్ , గొడిసెల కార్తీక్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం టీఏజిఎస్ జిల్లా అధ్యక్షులు కొరెంగ మాల శ్రీ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ సతీష్ పాల్గొన్నారు,