జనం న్యూస్ 14 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై విడుదల చేశారు. ముందుగా అక్కడ తూము వద్ద ఎమ్మెల్యే కొబ్బరి కాయను కొట్టి, చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ను తిప్పి కిందికి నీటిని వదిలారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులు బాగుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ ( బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి మాజీ జెడ్పిటిసి చల్లచక్రపాణి మాజీ పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి పలువురు నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….