జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ఫిబ్రవరి 9న ఘనంగా అమరజీవి బొంతా డానియేలు వర్ధంతి. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలతో నాగబైరు సుబ్బాయమ్మ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న అంశంపై ఖండన అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పక్కా గృహాల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవరకు సీపీఐ పోరాడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ అన్నారు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల నివేశన స్థలాల అర్జీల సమర్పణ ఫిబ్రవరి 10వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి అర్జీదారులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ నెల నెలా వేల రూపాయలు అద్దెలు కడుతున్నారని పేర్కొన్నారు. పేదలు కూలీ పనులకు వెళ్తే తప్ప పూట గడవదని, అలాంటిది అద్దెలు కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల ప్రకారం పేదలకు పట్టణంలో రెండుసెంట్లు, గ్రామాలలో మూడుసెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షల రూపాయలు అందజేయాలన్నారు. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పార్టీ సభ్వత్వ నమోదు, రెన్యువల్‌ను విస్తృతం చేయాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌పై వాట్సాప్ గ్రూపులలో నాగబైరు రామ సుబ్బాయమ్మ వ్యాఖ్యలపై ఖండన బహిష్కృత సీపీఐ చిలకలూరిపేట మాజీ ఇన్చార్జి కార్యదర్శి నాగబైరు రామ సుబ్బాయమ్మ పార్టీ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేయడాని సీపీఐ ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, కార్యవర్గ సభ్యులు తీవ్రంగా ఖండించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబించి పార్టీ నుంచి బహిష్కరించబడిన సుబ్బాయమ్మ సోషల్ మీడియాలో జిల్లా కార్యదర్శిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేయడం తన దిగజారుడుతనానికి నిదర్శన మన్నారు. పార్టీ నుంచి తొలగించారనే కక్షతో తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని సీపీఐ పేరుతో ఆమె చేస్తున్న కార్యక్రమాలకు, ఆమెను అనుసరిస్తున్న కొంతమందితోనూ సీపీఐ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పు చేసి బుకాయించటం, పార్టీ వ్యతిరేక కార్యకలపాలు నిర్వహించటం, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఫిబ్రవరి 9న ఘనంగా అమరజీవి బొంతా దానియేలు వర్ధంతి. ఫిబ్రవరి 9వ తేదీ మండలంలోని వేలూరు గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరజీవి బొంతా దానియేలు వర్ధంతిని నిర్వహించనున్నట్లు సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ ప్రదర్శన , బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరు కానున్నారని వెల్లడించారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏరియా పార్టీ సహాయ కార్యదర్శి బొంతా ధనరాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు అశోక్ సురభిరాజు, కందిమళ్ల వెంకటేశ్వర్లు, చౌటుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.