జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 14 రిపోర్టర్ సలికినీడి నాగు
మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ఎడ్యుకేషన్ సెక్రటరీస్ వీఆర్వో మెప్మా సిబ్బందితో పట్టణంలోని తల్లికి వందనం సంబంధించి అర్హత కలిగిన వారందరికీ రెండు రోజుల్లో ఎంక్వయిరీ చేసి వారందరికీ అర్హత కలిగించేలా ఆన్లైన్ చేయవలసినదిగా మున్సిపల్ చైర్మన్ ఆదేశించారు తల్లికి వందనం సంబంధించి పట్టణంలోని పొలాలు స్థలాలకు సంబంధించి విఆర్ఓ ద్వారా, ఇంటి పన్నులు సంబంధించి మున్సిపల్ సిబ్బందికి, పట్టణంలోని గృహాల ఎలక్ట్రిక్ సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన వారందరికీ అర్హత కల్పించి ఆధార్ లో లేని ఆస్తులను తొలగించి రెండు రోజుల్లో ఈ పనిని పూర్తి చేయవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు అంతేకాకుండా పట్టణంలోని P.4 సర్వే గురించి అమలు చేయుటకు ప్రజలకు అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు మరియు ఇంటి స్థలాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.