కూటమి ప్రభుత్వం వచ్చినా మార్పు లేదు
యథేచ్ఛగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకోని అధికారులు
జనం న్యూస్,జూలై14,
రాంబిల్లి మండలం పూడి సమీపంలో ఏపీఐఐసీ వారు సేకరించిన స్థలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా జూలై 13 ఆదివారం రాత్రి సుమారు 100 లోడులు పక్కనే నిర్మాణంలో ఉన్న కంపెనీకి తరలించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గ్రావెల్ అక్రమాలు తగ్గడం లేదని,ఏపీఐఐసీ వారు నియమించిన సెక్యూరిటీ సిబ్బంది మరియు సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు స్థానికులు నుండి విన్పిస్తున్నాయి.