జనం న్యూస్ - జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ -
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లో డ్రైనేజీ వ్యవస్థ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణితో అస్తవ్యస్తంగా మారింది. ఇన్ కాలనీలోని స్థానిక ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ వద్ద(ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదురుగా) డ్రైనేజీ మ్యాన్ హోల్ రోడ్డు ప్రక్కన పొంగిపొర్లుతూ దుర్వాసనను వెదజల్లుతుంది. చుట్టుపక్కల నివసించేవారు మురుగు నీటి వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా డ్రైనేజీ లైన్ బ్లాక్ అయినా పట్టించుకోవట్లేదని స్థానికుల ఆగ్రహం,వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.మెయిన్ బజార్ నుంచి వచ్చే డ్రైనేజీ లైను మ్యాన్ హోల్ మూతలు లేక చెత్త చెదారంతో నిండి బ్లాక్ అయ్యి పొంగిపొర్లుతుంది.మెయిన్ బజార్ వాటర్ ప్లాంట్ ఎదురుగా ఉన్న మ్యాన్ హోల్ పై మూత లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ లైన్లు సరిచేసి మ్యాన్ హోల్స్ పై మూతలు అమర్చాలని స్థానికులు కోరుతున్నారు.