జనం న్యూస్. జులై 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
గ్రామాల్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హత్నూర తహసిల్దార్ ఫర్విన్ షేక్ అన్నారు. సోమవారంనాడు హత్నూర మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ హత్నూర గ్రామానికి చెందిన నడిమిచెరువు సర్వేనంబర్ 367గల పంటకాలువను అడ్డుకుంటున్నారని రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు, ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖ అధికారులకు సూచిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్. ఏపిఎం దేవేందర్. నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్.వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, ఎంపీఓ యూసుఫ్, విద్యాశాఖ అధికారులు రెవెన్యూ అధికారులు. తదితరులు పాల్గొన్నారు.