జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం, మానాపురం గ్రామ రైల్వే గేటు సమీపంలో పెద్ద మానాపురం పోలీసులు మరియు ఈగల్ బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి, రెండు కారుల్లో ఒడిస్సా రాష్ట్రం పొట్టంగి నుండి విశాఖపట్నం తరలిస్తున్న 230కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు, పరారీ అయిన మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో జూలై 14న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ - జూలై 13న పెద మానాపురం మరియు ఈగల్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు పెద మానాపురం రైల్వే గేటు వద్ద ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టగా, సాలూరు వైపు నుండి వస్తున్న మారుతి ఆల్టో ఒఆర్ 02 ఎజె 7206, మారుతి 800 ఒక 19బి 4554 కార్లలో వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూచి, కార్లను విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు వారిని వెంబడించి (ఎ-1) కోరాపుట్ జిల్లా పొట్టంగి మండలం పదం పంచాయతీ జంగరాద గ్రామానికి చెందిన ఘాసిరాం హంతల్ (24 సం.లు) (ఎ-2) కోరాపుట్ జిల్లా సిమిగూడ మండలం దబాయిగూడ సంచాయతీ, ఝలియగూడ గ్రామానికి చెందిన కరన్ ఖిలో (24నం.లు) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిని విచారణ చేయగా పరారైన ముగ్గురు వ్యక్తులు (ఎ-3) సురేష్ అదకాబీయా (ఎ-4) ఖనిలతి (ఎ-5) జున్నేష్ గా గుర్తించామని, వీరిలో సురేష్ క్రియాశీలకమైన నిందితుడు అని అన్నారు. పరారైన ముగ్గురిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందలను ఖరెస్టు చేసి, రెండు కార్లును, 44 ప్యాకెట్లులో ఉన్న 230కిలోల గంజాయి, రూ.700/-ల నగదు, మూడు మొబైల్ ఫోన్లను సీజ్ చేసామన్నారు. ఎ-1 ఘాసిరాం హంతల్ పై 7 బైకులను చోరీ కేసులు ఉన్నాయన్నారు. ఎ-2 కరన్ ఖిలో ఓఆర్ 19బి 4554 మారుతి 800 కారును గంజాయి తరలించేందుకు ఎంగేజ్ చేసారన్నారు. నిండితులు గంజాయిని ఒడిస్సా రాష్ట్రం పొట్టంగి ప్రాంతంలో రెండు కార్లలో గంజాయి లోదు చేసుకొని, విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులకు వెట్టుబడినట్లుగా విచారణలో వెల్లడించారన్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని, వారిని పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కారకులైన వారిని కేసుల్లో నిందితులుగా చేర్చుతున్నామన్నారు. గంజాయి వ్యాపారంతో ఆస్తులను ఇక్రమంగా కూడబెడితే వారి ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ తరహా నేరాల్లో అక్రమంగా అస్తులు కూడబెట్టిని ముగ్గురి వ్యక్తులకు చెందిన సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఫ్రీజ్ చేసాముని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డిఎస్పి జి. భవ్యారెడ్డి, గజపతినగరం జి.ఎ.వి.రమణ, మానాపురం ఎస్ఐ ఆర్.జయంతి మరియు ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రధానం చేసారు.