సెంట్రింగ్ సామాగ్రి నిల్వ ఉంచిన స్తావరం పై పోలీసుల దాడి
రూ.5 లక్షల విలువైన సామాగ్రి స్వాధీనం
జనం న్యూస్ జూలై 15 సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన స్కాఫోల్డింగ్,సెంట్రింగ్ మెటీరియల్ స్తావరం పై పోలీసులు దాడి నిర్వహించారు. ఒఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) వద్ద నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువైన నిర్మాణ పరికరాలను అమీన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల కథనం ప్రకారం జూన్ 21, 22 తేదీలలో ఈ అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామగ్రిని గుర్తించారు. వీటిలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే పలు రకాల పైపులు, గోడల బార్లు, స్కాఫోల్డింగ్ వస్తువులు, ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయి.ఈ అక్రమ నిల్వపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలుచేపట్టారు.
రహదారుల సమీపంలో ఇలాంటి మెటీరియల్ నిల్వ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ….నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న నిర్మాణ సామగ్రిని స్వాధీనంచేసుకున్నాo.ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమీన్పూర్ సీఐ నరేష్, ఎస్ఐలు, క్రైం సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు.పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.