జనం న్యూస్ జులై 15 నడిగూడెం
మండలం పరిధి లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదికలో మంగళవారం వానాకాలం పంటలలో కలుపు యాజమాన్యంపై పాటించాల్సిన పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వివరించారు. అధిక దిగుబడి సాధనకు సూచనలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పే విషయాలను రైతులు అవగతం చేసుకోవాలని ఏఈఓ కె. రేణుక సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.