జనంన్యూస్. 15. సిరికొండ.
విజయవంతం చెయ్యండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాక..
చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000, కండరాల క్షీణించిన వారికి 15000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దగ్గరికి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని తెలియచేయడం జరిగింది. ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఈ నెల 18 నాడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో అన్ని సామాజిక పెన్షన్ దారుల, వికలాంగుల మరియు బీడీ కార్మికుల పెన్షన్ దారుల సమావేశం నిజామాబాద్ టౌన్ లోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి సిరికొండ మండలంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. మొట్టల దీపక్ ఎమ్మార్పీఎస్ సిరికొండ మండలం అధ్యక్షులు.