కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల రోడ్డు రవాణా హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష మలోత్ర కి విజ్ఞప్తి
జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం జిల్లాలోని రెబ్బన మండలం గోలేటి కి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల రోడ్డు రవాణా హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష మల్హోత్రా గారికి గోలేటి. సోనాపూర్ రైతులు వినతి పత్రం ఇచ్చిన రైతులు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గోలేటి ఓపెన్ కాస్ట్ లో భూములు ఇండ్లు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని ఓపెన్ కాస్ట్ భూములకు సింగరేణి యాజమాన్యం ఎకరాకు 60 లక్షల రూపాయల నష్టపరిహారంతోపాటు సింగరేణిలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ పేరుతో భూమి తీసుకుంటున్న రైతులకు ఎకరాకు భూ భారతి ప్రకారం మార్కెట్లో ఎకరాకు రూ.20లక్షలు కంటే ఎక్కడా తక్కువ లేదని గోలేటి లో రిజిస్ట్రేషన్ వేల్యూషన్ విలువ మినిమం 20 లక్షల వరకు ఉందని దానికి సింగరేణి యాజమాన్యం రెండు రెట్లు అనగా 60 లక్షలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ తక్కువగా అనగా రూ.2,25,000/- లుగా భూమి విలువ చూపించి రేటు కట్టి మేము అదనంగా రెండు రెట్లు అనగా రూ.7,56,000/-లు అధికంగా ఇస్తున్నామని చెప్పి అవార్డు ప్రకటించి రైతులను మోసం చేశారు. కానీ బయట మార్కెట్లో ఒక గుంట భూమి, ఎకరానికి రూ.20లక్షలు ఉన్నది. కానీ సింగరేణి, రైతులకు ఎకరాకు రూ.7.56 లక్షలు ప్రకటించి రైతులను తీవ్ర నష్టానికి గురి చేసి మోసం చేస్తున్నారని, సింగరేణి యాజమాన్యం కొంతమంది బ్రోకర్లను నియమించకొని భూమి కొలతలలో హెచ్చుతగ్గులు సృష్టించి కాస్తు, పట్టాదారు, అటవీ భూమి పేరుతో దళిత, గిరిజన, బిసి వర్గాలు భూమి సాగు చేస్తున్నా రైతుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. కావున మీరు మార్కెట్ విలువ రూ.20లక్షలు ఉన్నందున నష్టపరిహారం రెండు రెట్లు చొప్పున ఎకరానికి 60 లక్షలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి సింగరేణిలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని లేనిపక్షంలో వారు రోడ్డు మీద పడే అవకాశం ఉందని రైతులకు తగు న్యాయం చేయాలని లేనిపక్షంలో సింగరేణి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు. సోనాపూర్ గ్రామ పటేల్ కొమరం దొందె రావు. సొల్లు లక్ష్మి అసెంబ్లీ కన్వీనర్ అరిగెల మధుకర్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి. ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి వై సుచిత్. మండల అధ్యక్షులు మల్రాజు రాంబాబు. చేపూరి నవీన్ గౌడ్. ఇప్ప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు