జనం న్యూస్ 16జులై పెగడపల్లి ప్రతినిధి.
ధర్మపురి అభినందన సభను విజయవంతం చేయాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోడోయాత్రలో భాగంగా ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా గత వారం రోజుల క్రితం జరిగిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేయాలని పంపించి తెలంగాణ రాష్ట్రంలో 58 శాతం ఉన్న బీసీలకు 48 శాతం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందునఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు ఈనెల 17 గురువారం ఉదయం 11 గంటలకు ధర్మపురి లోని ఎస్ హెచ్ గార్డెన్ లో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షానఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి అభినందన సభ ఏర్పాటుచేస్తున్నందున మన పెగడపల్లి మండల కేంద్రం నుంచి బీసీ సంఘాల నాయకులతో పాటు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు అందరూ భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్, మండల నాయకులు కడారి తిరుపతి కృష్ణ హరి మందపల్లి అంజయ్య సింగసాని స్వామిచెట్ల కిషన్ ఆకుల విష్ణు దీకొండ తిరుపతి మందపల్లి సత్తయ్య బోలపట్ల ఐలయ్య బొడ్డు రమేష్ లైసెట్టి శంకరయ్య లింగంపల్లి మహేష్ పలువు నాయకులు పాల్గొన్నారు.