జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 15 రిపోర్టర్ సలికినీడి నాగు
పేదరిక నిర్మూలన కోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారు
గణపవరంలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి, కొమ్మాలపాటి.
పలు అభివృద్ధి పనులు ప్రారంభించి ఏడాది పాలనను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు.
రాష్ట్రంలో పేదరికం పోవాలన్నా… అన్నివర్గాలు వృద్ధిలోకి రావాలన్నా చంద్రబాబు నాయకత్వమే కీలకమని, అందుకోసం ప్రజలు మరో 15 ఏళ్లు కూటమిప్రభుత్వాన్నే ఆదరించాలని ప్రత్తిపాటి కోరారు. పేదరిక నిర్మూలనకోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారని, తొలిదశలో రాష్ట్రంలోని 15లక్షల పేద కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రత్తిపాటి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి, పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణతో కలిసి నాదెండ్ల మండలం గణపవరంలో పర్యటించారు. తొలుత దాతల సహకారంతో నిర్మించిన బస్ షెల్టర్, కల్వర్ట్ లను భాష్యం రామకృష్ణతో కలిసి ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం కొమ్మాలపాటితో కలిసి ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ప్రత్తిపాటి, కొమ్మాలపాటి ఇంటింటి ప్రచారం నిర్వహించి కూటమిప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. రూ.34లక్షల వ్యయంతో ఫిల్టర్ బెడ్ల సమస్య పరిష్కరించనున్నాం. ఫిల్టర్ బెడ్ల సమస్య పరిష్కరించి, గణపవరం గ్రామ తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరించబోతున్నామని ప్రత్తిపాటి చెప్పారు. అందుకోసం రూ.34లక్షలతో పనులు ప్రారంభించనున్నామన్నారు. త్వరలోనే గణపవరంలో అన్నాక్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రత్తిపాటి తెలిపారు. గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించి, ఎప్పటిలానే పంచాయతీగా కొనసాగిస్తామని, ప్రజల కోరికమేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, నెలరోజుల్లనే ప్రక్రియ పూర్తవుతుందని ప్రత్తిపాటి తెలిపారు. గతంలో టీడీపీ తరుపున నరసరావుపేట ఎంపీగా పోటీచేసిన వేణుగోపాల రెడ్డి గెలుపులో గణపవరం కీలకపాత్ర పోషించిందన్నారు. గతపాలకులు దోపిడీకోసమే గ్రామాల్ని మున్సిపాలిటీలో విలీనం చేశారు గత పాలకులు గణపవరం.. మానుకొండవారిపాలెం… పసుమర్రు గ్రామాల్ని అన్యాయంగా మున్సిపాలిటీలో విలీనం చేశారని, కేవలం దోపిడీకోసమే ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముక్కూముఖం తెలియని మాజీ అవినీతిమంత్రి గణపవరానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. చివరకు కాలువలు, వాగుల్లో పూడిక కూడా తీయకుండా రైతుల్ని కష్టాలపాలు చేశారని ప్రత్తిపాటి చెప్పారు. కూటమిప్రభుత్వం లిఫ్ట్ ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, దానిలో భాగంగానే ఓగేరు, కుప్పగంజి, నక్కవాగుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. తల్లికి వందనం రానివారు సచివాలయం సిబ్బందిని సంప్రదించి, సమస్యలు పరిష్కరించుకోవాలని, అన్నదాతా సుఖీభవ సాయం పొందడానికి ఉన్న సమస్యల్ని కూడా రైతులు పరిష్కరించుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎంపీ లావు, మంత్రి గొట్టిపాటి కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో రూ.4వేలు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటేనని, బీహార్లో రూ.400లు ఇస్తుంటే, తెలంగాణలో రూ.2,600 మాత్రమే ఇస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. నరసరావు పేట ఎంపీ కృష్ణదేవరాయలు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, కేంద్రనిధుల సాధనలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజల సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారని, అభివృద్ధిపనులకు అవసరమైన నిధుల మంజూరులో ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్క్ రామకృష్ణ, పేర్ని వీరనారాయణ, డాక్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్టీసీ డీఎం రాంబాబు,టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, గంగా శ్రీనివాసరావు, హిమవంతరావు, పెంట్యాల శేషయ్య, కందుల రమణ, కెల్లంపల్లి ఆచయ్య, నల్లమోతు హరిబాబు, ఇనగంటి జగదీష్, గాలి బుచ్చయ్య, హుస్సేన్, సలిశం శ్రీను, కాకుమాను సాయి, జాను, గాత్రం గాగాలిన్, కంచర్ల శ్రీనివాసరావు గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.