జనo న్యూస్ ;15 జులై మంగళవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ ;
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం, రామచంద్రపురం, వింజపల్లి, వర్కోలు, కోహెడ, తంగేళ్ల పల్లి,సీసీ పల్లి, బస్వపూర్, సముద్రాల, గుండారెడ్డిపల్లి ప్రాథమిక,ఉన్నత పాఠశాలలో యస్టీయు ఉపాధ్యాయ సంఘం 15 జూలై మంగళవారం రోజున సభ్యత్వ నమోదు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, పెండింగ్ బిల్లు విడుదల చేయాలని, సి.పి.యస్ రద్దు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్సి ని అందించాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మట్టపల్లి రంగారావు, జిల్లా ఆర్ధిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, జిల్లా బాధ్యులు కొర్తివాడ రాజేందర్, మురికి శ్రీనివాస్, మోర గణేష్, కోహెడ మండల అధ్యక్షులు హరిదాసు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కరీం, ఆర్థిక కార్యదర్శి వెన్న చంద్రశేఖర్, బెజ్జంకి మండలం ప్రధాన కార్యదర్శి రామంచ రవీందర్ జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.