జనo న్యూస్ ;15 జులై మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేటకు చెందిన కథ రచయిత ఐతా చంద్రయ్య రచించిన పాయమాలు కథల సంపుటి పుస్తకావిష్కరణ హైదరాబాదులోని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత మహాసభల్లో ముదిగొండ శివప్రసాద్, ఓలేటి పార్వతీశం, వడ్డి విజయసారథి, ఆంజనేయరాజు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రయ్య కథలలో సమాజం కదలాడుతుందని అన్నారు. చంద్రయ్య కథల సంపుటి ఆవిష్కరణ జరగడం పట్ల జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్ధవెల్లి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, పరశురాములు, సుధాకర్ తదితరులు అభినందనలు తెలిపారు.