జనం న్యూస్ 16 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
తెలంగాణకు చెందిన మదర్ తెరిసా సేవా సంస్థ నుండి ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు, మరో ప్రముఖ సంస్థ నుండి నంది అవార్డు అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర సంఘం వ్యవస్థాపకులు ఏలూరు వెంకట రమణమూర్తి (రాజేష్ శర్మ) ను ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, సహా పలువురు ప్రముఖులు మంగళవారం ఘనంగా సత్కరించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన రాజేష్ శర్మ పిల్లలను కూడా వారు సన్మానించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బాలల సాంస్కృతిక పురస్కారాలను సినీ నటులు బాల ఆదిత్య విజేతలకు అందజేసారు. అందులో భాగంగా విశాఖపట్నం విజయనగరం నుండి ముగ్గురు పిల్లలను ఎంపిక చేయగా వారిలో కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం పంచాయితీ మంగళపాలెం సాయి నగర్ కాలనీ ఎం పీ పీ స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న లలితా లాస్య లహరిక డ్రాయింగ్ కాంపిటేషన్లో మొదటి బహుమతి సాధించింది. మూడో తరగతి చదువుతున్న ఏలూరి లలితా శ్రావణి కూచిపూడి జూనియర్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. పీఎం పాలెం సృజన స్కూల్లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి శివ కార్తికేయ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ద్వితీయ స్థానం సాధించింది. రాజేష్ శర్మతో పాటు విజేతలుగా నిలిచిన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, పలువురు పెద్దలు క్యాంప్ ఆఫీసులో ఘనంగా సత్కరించారు. అద్భుత ప్రతిభ కనబరిచిన ఇలాంటి పిల్లలను అన్ని విధాలా ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే దేశపాత్రునిపాలెం పంచాయితీ పెద్దలు ఏలూరు వెంకటరమణమూర్తి శర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. కాగా తమను ఘనంగా సత్కరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస రావు తో పాటు దేశపాత్రునిపాలెం మంగళ పాలెం పెద్దలకు, రాజేష్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు.