జనంన్యూస్. 16.నిజామాబాదు.
ఇందూర్ నగరం : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు నిజామాబాదుకు విచ్చేసిన సందర్భంగా, నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గవర్నర్ ని పుష్పగుచ్చంతో ఆత్మీయంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్బంగా గవర్నర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమావేశమై ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు.గవర్నర్ పర్యటనకు హాజరైన శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు, "గవర్నర్ పర్యటన నిజామాబాదుకు ఎంతో గౌరవ కారణం అని. ఇది జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు," తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గవర్నర్ కి ఘన స్వాగతం పలికారు.