జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 16 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించడానికి జిల్లా విద్యా శిక్షణ సంస్థ( డైట్ )లెక్చరర్ అంబటి చెన్నకేశవరావు ఈరోజు సందర్శించడం జరిగింది . ఉదయం ప్రార్థన సమయానికి విచ్చేసి అసెంబ్లీ నిర్వహణ అంశాలను పరిశీలించారు తధనంతరం విద్యార్థుల నమోదు హాజరు పరిశీలించి తరగతి వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల నిర్వహణ తీరు ను పరిశీలించడం జరిగింది. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా చదవడం రాయడం ఉచ్చరణ దోషాలను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా అక్షరాల గుర్తింపు పదాలు చదవడం వాక్యాలు రాయడం స్వయంగా రాయడం చతుర్విధ ప్రక్రియలు పూర్తిస్థాయిలో చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్కులు ఎప్పటికప్పుడు సిలబస్ వారిగా కళ సంస్కృతిక కార్యక్రమాలు పూర్తిచేయాలని సూచించడం జరిగింది. భాష బోధనలు ప్రతిరోజు చేతి వ్రాత మెలకువలు నేర్పడం, నో బ్యాక్ డే నిర్వహించటం, మౌఖిక గణన సాధన చేయడం గణిత పట్టికలు డ్రిల్లింగ్ చేయడం వంటివి చేయాలని సూచించారు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు పి శైలజ ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు కె అరుణ జి ఆదిలక్ష్మి సిహెచ్ నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు