జనం న్యూస్ - జులై 16: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ -
తెలంగాణ టూరిజం నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనాన్ని బుధవారం నాడు ఖమ్మం జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి సందర్శించి పరిశీలించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన మహా స్థూపం లో బుద్ధ జ్యోతిని ఖమ్మం జిల్లా పర్యాటక శాఖ అధికారి వెలిగించారు. అనంతరం వీరు బుద్ధ చరితవనం, జాతకవనం ధ్యానవనం స్థూప వనాలను సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, బుద్ధవనం విశేషాలను వివరించారు. అనంతరం ఖమ్మం జిల్లా పర్యాటకశాఖ అధికారి సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా సంబంధాల మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు బుధవారం నాడు నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించినట్లుగా తెలిపారు. ఖమ్మం జిల్లా పరిధిలోని నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి సమీపంలో సుమారు 8 ఎకరాల స్థలంలో బుద్ధిష్ట్ థీమ్ పార్కును ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికిగాను నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనాన్ని సందర్శించి పరిశీలించామన్నారు. దీనిపై నివేదికను జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత స్థాయి అధికారులకు అందజేయనున్నట్లుగా తెలిపారు.