ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రెటరీ భీమ్ సింగ్
జనం న్యూస్ జూలై 16(నడిగూడెం)
ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల నమోదు తో పాటు విద్యార్థుల రోజువారి హాజరు శాతాన్ని పెంచాలని ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఇంటర్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ అధ్యాపకులను కోరారు. బుధవారం నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ విద్యా సంవత్సరం నమోదైన ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు రోజువారి విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి అధ్యాపకులు విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నందున , విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడిగూడెం కళాశాల విద్యార్థులకు బస్సు హాస్టల్ వసతి కల్పించాలని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జాన్ పాషా అధికారి దృష్టికి తీసుకువచ్చారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు.అధ్యాపకులు శ్రీధర్, కృష్ణ,మహేష్,వీరన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.