(జనం న్యూస్ 17 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
కాకులు లేకపోతె వేప చెట్లు లేవు, వేప చెట్లు లేకపోతే మిగిలిన పక్షి జాతికి ఆవాసం ఉండదు, ఎత్తయిన చెట్ల కొమ్మల మీదే తేనెటీగలు తుట్టు కడతాయి, నూటికి తొంబయి శాతం పక్షుల విసర్జన నుండే చెట్లు మొలకెత్తాయి.చెట్లు లేకపోతే వర్షాలు పడవు, చెట్ల గాలి యొక్క రసాయనిక చర్య వలనే మేఘ మధనం జరిగి వర్షాలు పడతాయి ,వర్షాలు లేకపోతే చిత్తడి నేల వుండదు, చిత్తడి నేల లేకపోతే గొంగళి పురుగు సీతా కొక చిలుక గా రూపాంతరం చెందదు, సీత కొక చిలుక పువ్వుల మకరందం గ్రోలుతూ రాల్చే పుప్పొడి వలనే మరొక మొక్క మొలకేత్తుతుంది. సీతాకోక చిలుకలు లేని భూమిని మనం ఊహించలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆలోచిస్తుంటే ఆందోళనగా బెంగగా ఉంది రాను రాను ఈ భూగోళం ఎంకానుంది మన భవిష్యత్తు తరాలకు మనం ఏం ఇవ్వబోతున్నాము అని . దయచేసి అందరికీ ఒక్కటే విన్నపం ఉన్న చెట్లని భాద్యతగా సంరక్షించుదాం, కొత్తగా కనీసం ఇంటికి రెండు మొక్కలనైన పెంచుదాం అని ఈరోజే ప్రతిజ్ఞ తీసుకొనే ఆచరణలో పెడుదాం...భవిష్యత్ తరాలకి ఒక ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందిద్దాం.