ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్- జూలై 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి మరియు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని తల్లిదండ్రులకు మరియు మీ మీద ఆధారపడిన వారికి గుండె కోత మిగల్చవద్దని, డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యమే కాకుండా మీ అందమైన జీవితం కూడా నాశనం అవుతుందని తెలిపారు, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ కెరీర్ పై దృష్టి పెట్టి విజయం సాధించాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న వారి వివరాలు తమకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానచార్యులు డి రాజశేఖర్, అధ్యాపకులు సతీష్ చంద్ర, సిహెచ్ వెంకటయ్య, ఏఎస్ఐ గురునాథరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.