జనం న్యూస్ జనవరి 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- కామారెడ్డి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా మున్నూరుకాపు సంఘం ఏర్పాటు అయ్యి 8 సంవత్సరాలలో మొట్ట మొదట జెండా ఆవిష్కరణ చెయ్యడానికి అవకాశం ఇచ్చిన జిల్లా మున్నూరుకాపు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. అలాగే మన సంఘ భవనం మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో మున్నూరుకాపులు గెలవాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని అన్నారు. సంఘం అభివృద్ధి కొరకు అందరి సహాయ సహకారాలు ఉండాలని తెలియచేసారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు మామిండ్ల అంజయ్య, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బజా లలిత, మున్సిపల్ వైస్ చైర్మన్ ఊరుదొండా వనిత, వైస్ ఎం పి పి నరేష్,నియోజకవర్గ కో ఆర్డినేటర్ కాసార్ల రవీందర్, అధ్యక్షులు కోమిరెడ్డి నారాయణ, యూత్ అధ్యక్షులు గోవర్ధన్, వెంకట్,రాజశేఖర్, నవీన్,లింగం, కుల బంధావులు తదితరులు పాల్గొన్నారు.