జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
జీవితాన్ని సర్వ నాశనం చేసే డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థులు అడుగులు వేయాలంటూ అమలాపురం డి.ఎస్.పి ప్రసాద్ ఉద్బోధించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం వీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వల్ల కలిగే అనర్ధాలు నష్టాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు, మత్తు పానీయాలు వంటి వాటికి బానిసలు అయితే భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుందని హెచ్చరించారు. అందువల్ల విద్యార్థులంతా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. ఈ సదస్సులో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబు, బీవీసీ ప్రిన్సిపాల్, ఏవో జక్కం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.