జనం న్యూస్ జూలై 18 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ
రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి ఎస్ యు టి ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో చిలిపిచేడ్ మండలం పరిధిలో ఉన్న వివిధ పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కోశాధికారి అజయ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్ యుటిఎఫ్ బాధ్యత యుతమైన సంఘమని ఇది ఎప్పుడు ఉపాధ్యాయ పక్షపాతిగా పనిచేస్తుంది అని, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తుందని, హక్కులు సాధించడంలో ముందుంటుంది అని ప్రభుత్వం హామీ మేరకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో ఇస్తామన్నా పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని చెల్లింపులు చేయాలని జిపిఎఫ్, టి ఎస్ జి ఎల్ ఐబిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని వెంటనే బదిలీలతో కూడిన ప్రమోషన్లు చేపట్టాలని కేజీబీవి పాఠశాలలో కెర్ టేకర్లను నియమించాలని టీఎస్ యుటిఎఫ్ సంఘం పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చిలపిచెడ్ మండల శాఖ అధ్యక్షులు ఏ. మోహన్ ,ఉపాధ్యక్షులు ఆదినారాయణ ,ప్రధాన కార్యదర్శి , టి. సత్యనారాయణ సార్ గార్లు పాల్గొన్నారు