జనం న్యూస్ 19జులై పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని శ్రీ వైష్ణవి టాలెంట్ హై స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ హైదర్ షేకీల్ కుమారుడు విద్యార్థి షేక్ సాహిల్ పోతురాజు వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నాడు. నేటి సమాజంలో కుల మతాలకు అతీతంగా పోతురాజు వేషధారణ పలువురుని ఆకట్టుకున్నది. తెలంగాణ సంస్కృత పండగ ఆషాడ మాసంలో శ్రీ వైష్ణవి టాలెంట్ హై స్కూల్ లో నిర్వహించిన బోనాల పండుగకు ఈ వేషధారణ వేయడం జరిగింది.