జనం న్యూస్జూలై 18:నిజామాబాద్
ఏర్గట్లమండలకేంద్రంలోని కే జీ బీ వీ పాఠశాల లో సి ఆర్టీ లు, బాలికలు, నాన్ టీచింగ్ స్టాప్ కలిసి బోనాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్ వో సుంకరి సంధ్యా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే పాఠశాల లో ఉత్సాహంగా బోనాలను తయారుచేసి,రకరకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యం సమర్పించిట్లు తెలిపారు. తెలంగాణలో ఆడ బిడ్డలు, ప్రజలు జరుపుకునే ముఖ్యమైన బోనాల పండుగ గురించి బాలికలకు వివరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల బాలికలు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.