జనం న్యూస్ 19 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రైతుల బతుకులు రోడ్డుకి ఈడ్చడమేనా కూటమి పాలన అని పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు ప్రశ్నించారు. స్థానిక గైతు బజార్ వద్ద రైతులతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం ఏడీకి వినతి పత్రం అందజేశారు. శంకర్రావు మాట్లాడుతూ… స్థలాన్ని ఖాళీ చేయించాలని అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తేవడం న్యాయమా అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం తప్పదన్నారు