జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 19-72025
జోగిపేట్ మున్సిపల్ మూడో వార్డ్ పరిధిలోగల బిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లన్న కాలనీవాసులు ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని పోచమ్మ అమ్మవారికి. బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి హాజరుకానున్నట్లు తెలిపారు, బోనాల పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పత్రిక, ఇది భక్తి, ఐక్యత, అనుబంధాలకు ప్రతీకని, బోనం అంటే భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఆహారం. తద్వారా అమ్మవారి శాంతిస్తుందని, కరువు, వరదల నుంచి కాపాడి, అంటు రోగాల బారిన పడకుండా ఉండాలని ఆదివారం బోనాల కార్యక్రమాన్ని మల్లికార్జున స్వామి దేవాలయం నుండి రహదారి గుండా పోచమ్మ దేవాలయం వద్దకు మహిళలు బోనాలను సమర్పించుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో శివశక్తుల బోనాలు, పోతురాజుల ఆటపాటలతో అమ్మవారికి బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం అయినది,