జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 19 రిపోర్టర్ సలికినీడి నాగు
ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా ప్రత్తిపాటిని సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు.
కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న స్థల సేకరణ సమస్యను మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పరిష్కరించారని, కోర్టు భవనం నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయించారని స్థానిక బార్ అసోసియేషన్ కార్యవర్గం తెలిపింది. శనివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటిని ఆయన నివాసంలో కలిసిన అసోసియేషన్ సభ్యులు.. ఆయన్ని సన్మానించి, తమ కృతజ్ఞతలు తెలియచేశారు. స్థానిక కోర్టు భవనం నిర్మాణానికి సరైన స్థలంకావాలని తాము కోరిన వెంటనే ప్రత్తిపాటి స్పందించారని, వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారని సభ్యులు తెలిపారు. ఒకానొక సందర్భంలో ఆయనే స్వయంగా అధికారులతో కలిసి కొన్ని స్థలాలు పరిశీలించి, తమను కూడా చూడాలని చెప్పారన్నారు. ఎట్టకేలకు నరసరావుపేట రోడ్డులోని గంగమ్మ తల్లి దేవస్థానం పక్కన, సర్వేనెంబర్ 186లో గల 41 సెంట్ల ప్రభుత్వభూమిని కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు హర్హం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియచేసినవారిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్యదర్శులు, సభ్యులు ఉన్నారు.