ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయం చేయనీయడం,
49 జీ,ఓ గ్రామాలలో ప్రభుత్వ పథకాలు అందడం లేదు
జనం న్యూస్ జులై 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసిలను మరి ఇతర పేదలను జల్ జంగిల్ జమీన్ కు దూరం చేసే కుట్రలో భాగంగా కార్పొరేట్లకు అడవిని అప్పజెంపే కుట్ర చేస్తూ బిజెపి ప్రభుత్వం, జీ ఓ నెంబర్ 49 ని 2025 మే 30న రేవంత్ సర్కార్ తో కలిసి తీసుకువచ్చింది, జిల్లాలో 339 గ్రామాలకు మనుగడ లేకుండా చేయాలని ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఇది ముమ్మాటికీ బీజేపీ సర్కార్ తెచ్చిన జి ఓ నే ,భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం బిజెపి, సర్కార్ కు జీఓ 49 ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంది, అందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం కౌట గూడా గ్రామపంచాయతీ పరిధిలో గల, గోండుగూడా, పర్దాన్గూడ, దద్పాపూర్ గ్రామాలలో కరపత్రం ప్రచారం చేయడం జరిగింది, ఈ గ్రామంలో గతంలో అడవి నుంచి గ్రామంలోకి పంది వచ్చి ముగ్గురు పైన దాడి చేసింది, అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదు,, అదేవిధంగా గ్రామాలలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, మురికి కాలువలు లేక వర్షపు నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం బృందానికి తెలియజేయడం జరిగింది, అందుకని ఈ సమస్యలపై అధికారులు స్పందించాలని నాయకులు కోరారు, అదేవిధంగా జిఓ 49 గురించి గ్రామాలలో ప్రచారం చేస్తూ దీనివల్ల ప్రజలకు చాలా నష్టం కలుగుతుందని ఈ జిఓ ను బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి, ప్రభుత్వాలు కల్పించే పథకాలను గ్రామాలలో అమలు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, గెడం టీకానంద్, గ్రామ మాజీ సర్పంచ్ కుడ్మెత లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ నాయకులు ఆదే లక్ష్మణ్ , గ్రామస్తులు శివ, అంబారావు, రుక్మ బాయ్ , సోము, ప్రవీణ్, విజయ్ కుమార్, మహేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు,