జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 26 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మాజీమంత్రి ప్రత్తిపాటి.దళితుల అభ్యున్నతికై కృష్ణమాదిగ ఆవిశ్రాంత పోరాటం చేశారు పత్తిపాటి పుల్లారావు.
కేంద్రప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం, అత్యంత ప్రతిభకనబరిచి, విశేష ప్రజాదరణ పొందిన ప్రఖ్యాత నటుడు నందమూరి బాలకృష్ణను వరించడం యావత్ తెలుగుజాతికే గర్వకారణం అని మాజీమంత్రి ప్రత్తిపాటి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేళ వివిధరంగాల్లో విశేష సేవలందించిన తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించడం అభినందనీయం. ప్రధానంగా సినీ, రాజకీయ రంగాల్లో విశేషమైన ప్రతిభాపాటవాలతో రాణిస్తున్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది. తండ్రికి తగ్గ వారసునిగా తన నటనా కౌశలంతో ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు బాలకృష్ణ. రాజకీయంగా హిందూపురం శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందించడంలో బాలయ్య తనకు తానే పోటీ పడుతున్నారు. మరోపక్క తన తల్లి స్మారకార్థం నిర్మించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా క్యాన్సర్ బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు బాలయ్య. నందమూరి నట సింహాన్ని వరించిన 'పద్మ' పురస్కారం… యావత్ తెలుగు జాతికే మణిహారం. కేవలం నటనకే పరిమితం కాకుండా, ప్రజాసేవ, మానవత్వం, దాత్రుత్వం, మంచితనం, ముక్కుసూటితనంతో దేశవ్యాప్తంగా ‘అఖండ’ అభిమానాన్ని సొంతం చేసుకోవడం బాలయ్యకే సాధ్యమైంది. ఎన్ని పురస్కారాలు, పదవులు పొందినా, ఎంత ఉన్నత స్థానాలు అధిరోహించినా, ఎప్పటికీ ఒదిగి ఉండే ఆయన నైజం.. నేటి, రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం. జై బాలయ్య… జనం బాలయ్య…. భవిష్యత్ లో భారతవని మెచ్చే బాలయ్యగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దళితుల కోసం వారి అభ్యున్నతి కోసం మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం మాటల్లో వర్ణించలేనిది, ఆయన సేవలకు గుర్తుగా కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయన్ని సత్కరించడం నిజంగా తెలుగురాష్ట్రాలకు గర్వకారణం.” అని మాజీమంత్రి పుల్లారావు ఆదివారం ఒకప్రకటనలో తెలియచేశారు.