జనం న్యూస్ జూలై 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన బొడ్డేడ నాగేశ్వరరావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు, పలువురు ఆయనను అభినందిస్తున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రదాన కార్యదర్శిగా బాద్యత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఉన్నత కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాదవ్ కి, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కి, జిల్లా అద్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కి, జోనల్ ఇంచార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరికి, జిల్లా ఇంచార్జ్ కర్రి చిట్టిబాబుకి, కొణతాల రాజాబాబు కి, పొనగంటి అప్పారావు కి, డా॥గండి వెంకట సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలిపారు.//