జనం న్యూస్ జనవరి 27 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో భాగంగాఇంటి వెనక మల్లేశం కురుమ సంఘ ఆధ్వర్యంలో స్కూల్ టీచర్స్ కి డైరీస్ పిల్లలకి బుక్స్ అండ్ జనరల్ నాలెడ్జి బుక్ మరియు యువతకి భగవద్గీత అందజేయడం జరిగింది మరియు కురుమ సంఘానికి టేబుల్ ఇచ్చారు అలాగే మద్దూరి లక్ష్మయ్య సంఘానికి బీరువా ఇవ్వడం జరిగింది కావున వీరిద్దరికీ కురుమ సంఘం తరఫున ఘనంగా సన్మానం చేయడం అలాగే సమాజంలో మాధవసేవయే మానవ సేవ అంటూ ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ఉండాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు