జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ లంక తల్లమ్మ తల్లి అమ్మవారికి ముమ్మిడివరం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల నుండి అమ్మవారికి ఊరి ఆడపడుచులు ఊరి కోడళ్ళు సారె సమర్పించారు చింతలమెరక రామాలయం నుండి గ్రామస్తులు అమ్మవారికి చలివిడి పానకాలు వివిధ రకాల స్వీట్లు పసుపు కుంకుమ పువ్వులతో శోభాయాత్రగా అమ్మవారి జై జై నామాలు చెప్పుకుంటూ దేవాలయానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గణేశుల బ్రహ్మానందం ఈ కార్యక్రమం మా గ్రామంలో తొలిసారిగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ ఆషాడం సారె కార్యక్రమం గత నెల రోజుల నుండి జిల్లా నలుమూలల అనేక గ్రామాలలో ఎస్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఈసారె కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు అమ్మవారికి ఈసారె సమర్పించడం వలన స్త్రీలకు సంపూర్ణ సౌభాగ్యత్వం సిద్ధిస్తుందని గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామాలలోఓ వ్యాధులు రాకుండా అమ్మ రక్షిస్తుందని తమ ఆడపడుచుగా భావించి సారె సమర్పిస్తున్నారు ఈ నెల రోజులు సారె సమర్పించిన ప్రతి ఒక్కరికి ఎస్ఎస్ఎఫ్ ధన్యవాదములు తెలియజేస్తుందని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాద వితరణ చేశారు.