జనం న్యూస్ 27 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా విశాఖలో దారుణం జరిగింది. ఏ తప్పు చేసిందో ఏమోగానీ ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు జుట్టు పట్టుకుని మరీ నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న ఓ మహిళపై.. పక్కనే ఉన్న దుకాణదారులు కిరాతకం గా ప్రవర్తించారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చు కెళ్లారు. ఈ దృశ్యా లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తిరిగి తననే బెదిరిస్తు న్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి విచారణ కూడా చేయకుండానే ఇరు వర్గాలపైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని వాపో యింది. హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందున తనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది. కేసును రాజీ చేసుకోవా లంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో పోలీసులపై సీపీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది…