జనం న్యూస్ జూలై 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలకేంద్రంలోనున్న పోలీస్ స్టేషన్ ను గురువారం రోజునా ఆర్మూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె. వెంకటేశ్వర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బందితో పరేడ్ నిర్వహించి, వారి హాజరు, క్రమశిక్షణవంటి అంశాలను తనిఖీ చేశారు.తరువాత స్టేషన్లో ఉన్న కేసు డైరీలు, రిజిస్టర్లు, నిత్య పత్రాలు తదితరాలను పరిశీలించారు. ప్రజల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు సిబ్బందికి సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చారు. అధికారులతో మాట్లాడుతూవిధులు నిబద్ధతతో నిర్వహించి, ప్రజలతో మర్యాదగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలి. గ్రామాలలో నిఘా పెంచి నేరాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ స్థానిక ఎస్సైపి. రాజేశ్వర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.