జనం న్యూస్ జూలై 25 (నడిగూడెం)
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మూడు పూటలా అన్నం పెట్టడమే లక్ష్యంగా అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
వేపూర్ తిరుపతమ్మ సుదీర్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలో జిల్లా సివిల్ సప్లై అధికారి వి.మోహన్ బాబుతో కలిసి నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తుందని,రేషన్ కార్డులు లేని నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంతో రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి పంపిణీ చేస్తుందన్నారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలో సన్న బియ్యం,నూతన రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు.కోదాడ శాసనసభ్యురాలు నియోజకవర్గం ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయుటకు నిధులు మంజూరు చేస్తూ కోదాడను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.ఉత్తమ్ దంపతులు సహకారంతో కోదాడ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే కోదాడ ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ సివిల్ సప్లై అధికారి యం. శ్రీనివాస్ రెడ్డి,ఆర్డిఓ సూర్యనారాయణ,తహసిల్దార్ వి. సరిత, సివిల్ సప్లై డిటి రామిరెడ్డి, కేఆర్సి పురం పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూత్కూరి వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీనివాస్,రేపాల పురుషోత్తం,కాంగ్రెస్ పార్టీ నాయకులు మొక్కా బిక్షపతి,పల్లా వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు,గుజ్జా అంజి,మిడిదొడ్డి శ్రీనివాస్, సోమయ్య, గోవర్ధన్,సిపిఎం మండల కార్యదర్శి సత్యనారాయణ,రైతు కూలీ సంఘం నాయకులు వీరాంజనేయులు,ప్రజా ప్రతినిదులు,మాజీ ప్రజా ప్రతినిధులు, నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.