నూతన మండల కేంద్రంగా తడ్కల్ ను ఏర్పాటు చెయ్యాలని బిఆర్ఎస్ నాయకుల డిమాండ్.
జనం న్యూస్,జులై 25,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ను నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని తడ్కల్ మండల సాధన సమితి శుక్రవారం స్థానిక పత్తి మిల్లులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తడ్కల్ మండల కేంద్రంగా జీవో జారీ చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంతో మండల ప్రకటన నిలిచిపోయిందని పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పట్లోళ్ల సంజీవరెడ్డి,గతంలో నిరసనలు,ధర్నాలు, నిర్వహించిన వారు ఈ ప్రాంతానికి వెనుకబాటుకు కారణం అవుతున్నారని ప్రజలు ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదలు తడ్కల్ మండలంగా ఏర్పాటు చేస్తామన్న నాయకులు కనిపించకుండా పోయారని నూతన మండల ఏర్పాటు మాటే ఎత్తడం లేదని పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ తడ్కల్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న హామీని వెంటనే మండలంగా ప్రకటించి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఇది మాటల ప్రభుత్వమే కానీ,చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీకు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే త్వరితగతీన మండలంగా ప్రకటించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి ప్రాయంలోనే మండలాల విస్తరణలో భాగంగా రిలే నిరాహార దీక్షలు అమరణ నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని పెద్ద ఎత్తున వంట వార్పు కార్యక్రమం నిర్వహించామని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మండలం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం 40 రోజుల అబ్జెక్షన్ పిరియడ్ ముగియక ముందుగానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికారికంగా మండల ప్రారంభోత్సవం ఆగిపోయిందని అన్నారు.ప్రస్తుతం ప్రభుత్వంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, మండలాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికల్లో మా ప్రాంత ప్రజల ఓట్లను అడగాలని లేనియెడల, ఎమ్మెల్యే ఎంపీ తో పాటు మీ కాంగ్రెస్ కార్యకర్తలకు గ్రామాలలో తిరగనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కోట ఆంజనేయులు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దత్తు రావు,ఎంపీటీసీ ముత్యాల సాయిలు, సర్పంచ్ సాయిలు, శ్యామ్ రావు నాయిక్, రాజ్ కుమార్,చాంద్ సాబ్,అంజయ్య చారి, నరసింహ,పరిసర గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.