జనం న్యూస్ జూలై 25 (నడిగూడెం)
వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని నడిగూడెం పల్లె దావఖానా డాక్టర్ హరినాధ్ తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను వైద్య సిబ్బందితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటశాలను,డైనింగ్ హాల్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు నిలువ ఉన్నట్లయితే దోమలు వృద్ది చెందుతాయని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు వస్తాయని, కావున పరిసరాలలో పనికిరాని గుంటలు, లోతట్టు ప్రదేశాలు నీటి నిలువ లేకుండా చూసుకోవాలని,పాత బావులను పుడ్చెయాలని, ముఖ్యంగా ఎండాకాలం వాడిన కూలర్లలో నీరు తీసేయాలని, చెత్తాచెదారం మురుగు కాలంలో చేరకుండా చూసుకోవాలని, కంప చెట్లను పిచ్చి మొక్కలను తొలగించాలని, మరుగుదొడ్ల గాలి గొట్టాలకు మెష్ కట్టించాలని, ఇంటి ఆవరణలోని పనికిరాని వస్తువులను పరిశీలించి నీరు నిలవకుండా తొలగింపజేయాలని, ఇండ్లలో నీరు నింపుకునే పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి ఆరబెట్టి మళ్ళి నింపుకోవాలని, పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు, టైర్లు, పూల కుండీలలో నీరు నిలవకుండా చూసుకోవడం వలన దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, బోదకాలు, మెదడువాపు ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు.విద్యార్థులు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలని, ఆహారం తీసుకునే ముందు చేతులు పరిశుభ్రంగా కడుకోవాలని,గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని,వేడిగా ఉన్న ఆహారాన్నే తిన్నాలన్నారు.వ్యక్తిగత పరిభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ హైమావతి,హెల్త్ అసిస్టెంట్ కృష్ణమూర్తి,ఎయన్ఎంలు సుజాత,రాధ,ఆశా కార్యకర్తలు సైదమ్మ,లక్ష్మీ, సునీత,లక్ష్మీ,స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థినులు పాల్గొన్నారు.