మద్నూర్ జులై 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల మరియు హాస్టల్ ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు శుక్రవారం అకస్మిక చేశారు.హాస్టల్ మొత్తం తిరిగి వంటగది, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ వార్డెన్ కు, విద్యార్థులకు తెలిపారు. వ్యక్తి గత శుభ్రత కూడా చాలా అవసరం అన్నారు.