వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్
జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని నామాపూర్ గ్రామంలో ఎంపీడీఒ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కు భూమిపూజచేశారుఅనంతరంరాములు గౌడ్ మాట్లాడుతూ రాబో రెండు సంవత్సరాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలోఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేద లందరికీ ఇండ్లు మంజూరు చేయించి పేదలందరి ఇంటి నిర్మాణ కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గత టిఆర్ఎస్ పాలనలో అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు ఇవ్వక ప్రజలను మోసం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదని ఎద్దేవా చేశారు.అదేవిధంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గృహలక్ష్మి 500కు సిలిండర్ రైతులందరికీ రుణమాఫీ రైతు భరోసా నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ కార్డు లేని పేదవారికీ రేషన్ కార్డులు మంజూరు చేసి ఘనత రేవంత్ రెడ్డి సర్కారుది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ మండల నాయకులు సంధి మల్లారెడ్డి కడారి తిరుపతి స్థానిక నాయకులు ముదిగంటి పవన్ రెడ్డి ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి భరత్ రెడ్డి కొల్లూరు రమేష్ తోట రామ్ రెడ్డి అన్రెడ్డి సంతోష్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.