జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం సపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన మండలం చెయ్యేరు, తదితర ప్రాంతాలలో పలు కుటుంబాలను కలిసిన శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్,ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరించారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు ఎదుర్కొన్నటువంటి సమస్యను వివరించారు తక్షణమే శాసనసభ్యులు స్పందించి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ చెల్లి సురేష్ నడింపల్లి సుబ్బరాజు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ తవటపల్లి నాగేంద్ర నంద్యాల వెంకన్న బాబు బిజెపి నాయకులు గ్రంధి నానాజీ నంద్యాల చంటి మట్ట సూరిబాబు తదితరులు