ప్రతీ పౌరుడు భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి
జనం న్యూస్ 27 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న శార్వాణీ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాలలో
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - జీవితంలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రతీ భారతీయ పౌరునికి రాజ్యాంగం కొన్ని హక్కులను, బాధ్యతగా వ్యవహరించేందుకు కొన్ని ప్రత్యేక విధులను అందించిందన్నారు. ప్రతీ విద్యార్థి శాస్త్రీయ దృక్పదాన్ని అలవర్చుకోవాలని, ప్రతీ విషయం గురించి ఆలోచన చేసి, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత చదువులను అందించాలని, పిల్లలు కోరుకున్న రంగంలో రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలన్నారు. అదే విధంగా విద్యార్ధులు తమకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు కృషి చేయాలని, దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బహుమతులను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధులు దేశభక్తి పెంపొందించే విధంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి. జాతీయ నాయకుల వేష ధారణలో వచ్చిన విద్యార్థులతో జిల్లా ఎస్పీ కాసేపు ముచ్చటించి, మిఠాయిలను, చాక్లెట్స్, బిస్కెట్లను పంచారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఆర్లు టి.శ్రీనివాసరావు, ఎన్. గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్.ఎస్.ఐ. ప్రసాద రావు, పాఠశాల ప్రిన్సిపాల్ పి.సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు, దంతేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.