జనం న్యూస్ జూలై 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డు లో కొండ కొప్పాక, కొత్తూరు నరసింహరావు పేట, సిరసపల్లి, సాలాపువానిపాలెం, తాడి సచివాలయాల్లో కూటమి ప్రభుత్వం పి ఫోర్ పై పేదరిక నిర్మూలన కోసం జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులకు అవగాహన కల్పించడం కోసం సచివాలయ సిబ్బంది ప్రభుత్వ విధానాన్ని వివరించారని 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి నీలబాబు తెలిపారు. పేదరికం లేని రాష్ట్రాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి పేద కుటుంబాల్ని దత్తత తీసుకునే ఆర్థికంగా స్థిరపడిన వారి నుండి పేదవాళ్ల ఆదుకునే విధానమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని దీనికి సహకరించాలని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని నీలాబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి సన్యాసిరావు సాలాపు మోహన్ కసిరెడ్డి సత్యనారాయణ వానపల్లి బాబురావు బోయిన మురళి జనసేన దుర్గాప్రసాద్ మజ్జి శ్రీను నాయకులు పాల్గొన్నారు.