విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలోని కామాక్షినగర్, ఉడా కాలనీ శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై జూలై 24న పోలీసులు డ్రోన్స్ సహాయంతో రైడ్స్నిర్వహించి, ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న ఆరుగురిపై విజయనగరం 1వ పట్టణ పోలీసులు కేసులు నమోదు
చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించేందుకు డ్రోన్సును విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జూలై 24న సాయంత్రం విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలోని కామాక్షినగర్, ఉడా కాలనీ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్సోతో నిఘా ఏర్పాటు చేసామన్నారు. డ్రోన్స్ ప్రయోగించి, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొన్నామన్నారు. వారిపై ఓపెన్ డ్రింకింగు
కేసులను విజయనగరం 1వ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసారని జిల్లా ఎస్పీ తెలిపారు. నేర నియంత్రణలోను,శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, ట్రాఫిక్ నియంత్రణకు, జాతరల్లోను డ్రోన్సును విస్తృతంగా వినియోగించాలని, శివారు ప్రాంతాలపై డ్రోన్స్ ను వినియోగించి, నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.