జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు.
కురుస్తున్న ముసురు వర్షానికి ముందస్తు జాగ్రత్తలు..
జనం న్యూస్ జూలై 26 వికారాబాద్ జిల్లా రిపోర్టర్
వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాత ఇండ్లలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాల ను పట్టుకోకూడదు. కరెంటు షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు వెళ్లకూడదు. వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి దయచేసి అందరూ గమనించగలరు. మీ గ్రామాలలో ఏమైనా సమస్య ఉంటే ఆశ వర్కర్ కు , గ్రామ కార్యదర్శికి మరియు సంబంధిత అధికారులకు చెప్పగలరు.